- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
by Ramesh Naini |
నగరంలోని సోమాజిగూడ ప్రాంతంలో ఉన్న అల్‌ఫైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని సోమాజిగూడ ప్రాంతంలో ఉన్న అల్‌ఫైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






