- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: అన్నోజిగూడ కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడలో గల కెనరా బ్యాంక్ శాఖలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో : మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడలో గల కెనరా బ్యాంక్ శాఖలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. అన్నోజిగూడలో ఉన్న కెనరా బ్యాంక్ భవనం నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బ్యాంక్‌లోని కంప్యూటర్లు, ఫర్నిచర్, ముఖ్యమైన రికార్డులు కాలి బూడిదైనట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.






