గచ్చిబౌలి వాహనదారులకు బిగ్ అలర్ట్.. సంవత్సరం పాటు ట్రాఫిక్ మళ్లింపు

by Kema Shiva Kumar |

గచ్చిబౌలి-లింగంపల్లి వాహనదారులకు సైబాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనుల కారణంగా ఏడాది పాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

గచ్చిబౌలి వాహనదారులకు బిగ్ అలర్ట్.. సంవత్సరం పాటు ట్రాఫిక్ మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి-లింగంపల్లి (Gachibowli–Lingampally) మార్గంలో ప్రయాణించే వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో, ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఈ ఆంక్షలు ఏకంగా ఒక సంవత్సరం పాటు అమల్లో ఉండనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపడుతున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలపై ఆంక్షలు ఉంటాయి. దీంతో గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, కొండాపూర్ వైపు వెళ్లే వాహనాదారులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది.

ముఖ్యమైన డైవర్షన్లు ఇవే..

అయితే, వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనాలు నేరుగా కాకుండా ఇతర అంతర్గత రోడ్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద డైవర్ట్ చేస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ హోటల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అదనపు సిబ్బందిని మోహరించారు. ఒక సంవత్సరం పాటు ఈ పనులు కొనసాగుతాయని, వాహనదారులు తమ ప్రయాణ సమయాన్ని బట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వారు గూగుల్ మ్యాప్స్, ట్రాఫిక్ పోలీసుల సూచనలను గమనిస్తూ సహకరించాలని రిక్వెస్ట్ చేశారు.

Next Story