- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశావహులకు బిగ్ అలర్ట్.. MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్
తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై తాజా అప్‌డేట్. జనగణన,

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అని అశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే, వారందరికి నిరాశే ఎదురయ్యేలా పరిణామాలు ఉన్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న పాలనాపరమైన ప్రక్రియలు, విద్యా సంవత్సరం మార్పుల నేపథ్యంలో జులై చివరి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన గణన (Census) ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నం కానుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే జరగనుండటంతో, అధికారులందరూ ఈ విధుల్లోనే ఉండనున్నారు.
మరోవైపు ఉద్యోగుల బదిలీలు..
ఇక ప్రభుత్వం మే 1 నుంచి మే 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బదిలీల ప్రక్రియ ఈ నెలంతా కొనసాగనుంది. జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలులోకి రానుంది. ఈ లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని స్పష్టమవుతోంది. అదేవిధంగా జూన్‌లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల పెంపు, బడుల బాగు వంటి కార్యక్రమాలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధ్యాయులు అడ్మిషన్ల పనుల్లో ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది.
రాజకీయ సమీకరణాలు..
గత ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) ముగిసిన తర్వాత, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అశావహులు భావించారు. అయితే, ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కులగణన లేదా తాజా జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ ముగియకుండా నోటిఫికేషన్ (Notification) ఇచ్చేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. జూలై చివరి నాటికి జనగణన సర్వేతో పాటు ఉద్యోగుల బదిలీల ప్రక్రియలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఎన్నికలను నిర్వహించేలా కనిపిస్తోంది. అప్పటి వరకు మండల, జిల్లా పరిషత్‌లు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగనున్నాయి.






