- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండు పార్టీలను కలిపేందుకు మజ్లిస్ మధ్యవర్తిత్వం.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
ఆ రెండు పార్టీల ఆలోచనలు సేమ్ టు సేమ్ అని, రెండు పార్టీలు మరోసారి దోస్తీకి సిద్దమయ్యాయని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఆ రెండు పార్టీల ఆలోచనలు సేమ్ టు సేమ్ అని, రెండు పార్టీలు మరోసారి దోస్తీకి సిద్దమయ్యాయని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ (Kejrowal) ఢిల్లీ (Delhi)లో ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైనట్లుందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ (KTR) బహిరంగ ఆహ్వానం పలికారని దుయ్యబట్టారు. అలాగే కేసీఆర్ (KCR) రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని, 2004లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో గెలిచి యూపీఏ1 (UPA1)లో కేంద్ర మంత్రి (Union Minister) అయ్యారని గుర్తు చేశారు.
అంతేగాక 2014లో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు. వారిద్దరి మధ్య దోస్తీ గురించి బీజేపీ చాలాసార్లు చెప్పిందని, చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కేవలం రూ.2 లక్షలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాల విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించిందని, కానీ పేదల ఇళ్ల కోసం మాత్రం స్థలం ఇవ్వలేదని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. బీజేపీని ఓడగొట్టేందుకు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమేననే సంకేతాలను కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వంతపాడిందని ఆరోపించారు. కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి మంత్రులవుతారని, ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని, ఇద్దరి ఆలోచనలు సేమ్-టు-సేమ్ అని చెప్పేందుకు ఇంతకన్నా ఇంకా ఏం కావాలన్నారు.
రాష్ట్రపతిగా.. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం, ముస్లిం ఓట్ల కోసం.. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ఇద్దరొక్కటయ్యారని తెలిపారు. అలాగే 2023 ఆగస్టులో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ.. బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సందర్భంలోనూ.. జాతి ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిచ్చిందని వివరించారు. ఈ రెండు పార్టీల అనైతిక పొత్తును చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని, అలాంటిది మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. తుష్టీకరణ రాజకీయాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ పార్టీలను మరోసారి కలిపేందుకు మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.






