Mahila Congress: సీఎం రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేసిన మహిళ కాంగ్రెస్ నేతలు

by Ramesh Goud |

మహిళ కాంగ్రెస్(Mahila Congress) ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు(Celebrations) ఘనంగా జరిగాయి.

Mahila Congress: సీఎం రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేసిన మహిళ కాంగ్రెస్ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళ కాంగ్రెస్(Mahila Congress) ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు(Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళ కాంగ్రెస్ నేతలు(women Congress Leaders) సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) పాలాభిషేకం(Anointed With Milk) చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాల పేరుతో సంబరాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్(Gandhi Bhavan) లో మహిళ కాంగ్రెస్ ఆధ్యర్యంలో కాంగ్రెస్ లోని మహిళా నేతలు విజయోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు(Mahila Congress President Sunitha Rao) సహా ఇతర మహిళ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంవత్సరం పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, కాంగ్రెస్ పాలనకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు అని మహిళ కాంగ్రెస్ నేతలు అన్నారు.

Next Story