- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahila Congress : మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల(Prajapalana Vijayotsavalu)సంబరాలు(Celebrates)గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్(Mahila Congress)ఆధ్వర్యంలో సంబరంగా నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల(Prajapalana Vijayotsavalu)సంబరాలు(Celebrates)గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్(Mahila Congress)ఆధ్వర్యంలో సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు(Sunitha Rao)సహా పార్టీ మహిళా నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోనియా గాంధీ నాయకత్వం.. రాహూల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి.. ప్రజాపాలన జిందాబాద్.. జై కాంగ్రెస్ నినాదాలతో హంగామా చేశారు.
అనంతరం రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను ఒక్కోటిగా అమలు చేస్తు ముందుకెలుతుందన్నారు. బీఆర్ఎస్ పాలకులు పదేళ్లలో తెలంగాణ వనరులను దోచుకుని, రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయినప్పటికి, రాష్ట్రం ఇచ్చిన బాధ్యాతాయుత పార్టీగా తెలంగాణ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తూ, హామీలను అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200యూనిట్ల గృహజ్యోతి, రూ.500సిలిండర్ పథకాలను అమలు చేస్తుందని, డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తుందని తెలిపారు.






