- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maheshwar Reddy: రాజకీయ లబ్ధి కోసమే కుల గణన.. మహేశ్వర్ రెడ్డి ఫైర్
రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ (Congress) కులగణన (Cast Census) చేపట్టిందని.. ఆ నివేదికపై నేడు అసెంబ్లీ (Assembly)లో చర్చ పెడుతోందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ (Congress) కులగణన (Cast Census) చేపట్టిందని.. ఆ నివేదికపై నేడు అసెంబ్లీ (Assembly)లో చర్చ పెడుతోందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేఎల్పీ (BJLP) కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కుల గణనకు తెర లేపిందని, నేడు అసెంబ్లీలో చర్చ పెడుతోందని ఫైర్ అయ్యారు.
బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు పెంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి (Kamareddy) బీసీ డిక్లరేషన్ సభ (BC Declaration Meeting)లో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా..అని ప్రశ్నించారు. వాటిని నెరవేర్చకుండా కులగణన (Cast Census) పేరుతో ఇన్నాళ్లు కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రస్తుతం కేబినెట్‌లో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు. కేవలం స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుల గణన చేపట్టారని ఆరోపించారు. గతంలో సకల జనుల సర్వే చేయించిన మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదని కామెంట్ చేశారు.






