ఇతరుల శాఖల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు.. మంత్రులకు మహేశ్ కుమార్ గౌడ్ చురకలు

by Gantepaka Srikanth |

రాష్ట్ర మంత్రులకు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఇతరుల శాఖల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు.. మంత్రులకు మహేశ్ కుమార్ గౌడ్ చురకలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రులకు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరి శాఖల గురించి మరో మంత్రి మాట్లాడటానికి వీళ్లేదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలపై మాట్లాడటం కరెక్ట్ కాదని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించాను.. ఆయన కూడా దానిపై వివరణ ఇచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసమే అలా మాట్లాడినట్లు తెలిపారు. ఇక నుంచి ఎవరూ అలా మాట్లాడటానికి వీళ్లేదు.. హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవని మంత్రులకు(Telangana Ministers) వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు.. కొండ మురళి వ్యాఖ్యలపైనా మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ఇరువర్గాల గురించి ఫిర్యాదులు అందాయని చెప్పారు. అక్కడ నెలకొన్న పరిస్థితులకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టును అందజేయాలని అబ్జర్వర్లకు సూచించామని చెప్పారు. ఆ రిపోర్టు అందగానే క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలో ఎవరి ఇష్టారీతిన వారు మాట్లాడవద్దని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ తాను ఎమ్మెల్యే బరిలో ఉన్నట్లు ప్రకటించుకోవడాన్ని తప్పు పట్టలేదు. ఆయన గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నారు.. ఇందులో తప్పేం లేదని అన్నారు.

Next Story