- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇది మంచి పద్ధతి కాదు’.. బండి సంజయ్‌కి పీసీసీ చీఫ్ స్వీట్ వార్నింగ్
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)కి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)కి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను తక్షణమే కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌దే అన్నారు. కాంగ్రెస్ మీద అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వట్లేదని కీలక ఆరోపణలు చేశారు. యూరియా కోసం ఇక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే కిషన్ రెడ్డి ఢిల్లీలో నిద్రపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి ఇది మంచి పద్దతి కాదని అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంతోనే యూరియాను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.






