కేసీఆర్ మీటింగ్ పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ చాలెంజ్ విసిరారు.

కేసీఆర్ మీటింగ్ పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేం 70 శాతం గెలిచామని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్ రావు తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు ఏర్పడ్డాయని వృథా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ అప్పులపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

కిషన్ రెడ్డి చాలెంజ్ కు సిద్ధమా?

ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగున వివక్ష చూపిస్తోందన్నారు. మోడీని ప్రశ్నించే సామర్థ్యం లేని కిషన్ రెడ్డికి .. సోనియా గాంధీకి లేఖ రాసే హక్కు లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో తెలంగాణపై పక్షపాతం చూపిస్తోందన్నారు. బీజేపీ 12 ఏళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డికి చాలెంజ్ విసిరారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రై రాష్ట్రానికి చేసిందేంటో వివరించాలన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు.

Next Story