- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా సక్సెస్‌కు కారణం అవే.... ఎగ్జిట్ పోల్స్‌పై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది.. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. భారీ మెజార్టీతో గెలవబోతోన్నామని జోస్యం చెప్పారు. ప్రజలంతా నవీన్ యాదవ్ వైపే నిలిచారని అన్నారు. ఉపఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ముందుకు నడిపించారని చెప్పారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంలో తాము సఫలం అయ్యామని ధీమా వ్యక్తం చేశారు.
Read More... జూబ్లీహిల్స్‌లో సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే..?
Next Story






