- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇప్పటికీ జవన్ రెడ్డి అంటే మాకు గౌరవం ఉంది’: మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని, ఆయన అంతటి పెద్ద నాయకుడు ఇలాంటి తప్పు చేస్తారని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం దక్కిందని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. కేవలం స్థానికంగా ఉన్న చిన్నపాటి సమస్యల కారణంగా దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడటం సరికాదని ఆయన హితవు పలికారు. "ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్ పక్కన కూర్చోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి నవ్వుల పాలయ్యే పనులు ఆయన స్థాయికి తగవు" అని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీ వీడినప్పటికీ జీవన్ రెడ్డిపై తమకు ఇంకా గౌరవం ఉందని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పార్టీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.






