Congress: కమ్యూనిస్టులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు

by Gantepaka Srikanth |

దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిందని భావించడం పొరపాటని, వారు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు.

Congress: కమ్యూనిస్టులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు
X

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిందని భావించడం పొరపాటని, వారు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్ట్ భావజాలం ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేస్తూ, వారి ఉనికిని తక్కువ అంచనా వేయవద్దని పేర్కొన్నారు. దేశంలో కమ్యూనిజం కనుమరుగైందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో వారు ఇప్పటికీ బలంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు ‘ప్రజలు ప్రతిపక్ష పాత్ర కేసీఆర్‌కు ఇచ్చారు.. కానీ ఆయన ఫామ్ హౌజ్‌కు పరిమితం అయ్యారు. అయినా మేము ప్రతిపక్ష నేతను గౌరవిస్తున్నాము. కేసీఆర్‌ లాగా బిహేవ్ చేయము. ఆనాడు దళితుడు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ ఓర్చుకోలేక పోయారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ వీక్‌గా ఉందన్న విషయం మోడీకి అర్థం అయ్యింది. అందుకే తెలంగాణకు వచ్చినట్టు మాకు అర్ధం అవుతుంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.

Next Story