- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్లకు సిద్ధం కండి.. కాంగ్రెస్ నాయకులకు పీసీసీ చీఫ్ ఆదేశం
అడ్వొకేట్ జనరల్‌తో సమావేశం అనంతరం తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: అడ్వొకేట్ జనరల్‌తో సమావేశం అనంతరం తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్(Notification of Local Elections) వెలువడే అవకాశం ఉందని అన్నారు. ఆశావహులందరూ రేపటినుంచే నామినేషన్లు వేసుకోవచ్చు అని చెప్పారు. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులంతా కాంగ్రెస్ శ్రేణుల చేత నామినేషన్లు వేయించాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈరోజు హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకునే అవసరం, పరిస్థితి రెండూ లేవని అన్నారు. ఏం జరిగినా ముందుకు పోతామని ప్రకటించారు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.






