బండి భగీరథ్‌ అరెస్ట్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు: టీపీసీసీ చీఫ్

by Gantepaka Srikanth |

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి భగీరథ్‌ అరెస్ట్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు: టీపీసీసీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మహేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరగడం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉందని చెప్పారు. తప్పకుండా భగీరథ్‌ను అరెస్ట్ చేస్తారని.. ఇందులో అనుమానమే లేదని అన్నారు. అరెస్ట్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పారు. భగీరథ్‌ను తప్పించే అవసరం మాకు లేదని వెల్లడించారు. ప్రస్తుతం భగీరథ్‌ పరారీలో ఉన్నాడని తెలిసింది. ఈ గ్యాప్‌లోనే విదేశాలకు వెళ్లాడని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ నిజంగానే విదేశాలకు వెళ్లినా, రప్పించడం, తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు.

మరోవైపు.. బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో భగీరథ్‌ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

Next Story