‘ఆ స్కీమ్‌పై కేంద్రం కుట్ర’ అంటూ.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-16 11:10:47  IST  )

‘ఆ స్కీమ్‌పై కేంద్రం కుట్ర’ అంటూ.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపు

‘ఆ స్కీమ్‌పై కేంద్రం కుట్ర’ అంటూ.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Scheme)లో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు రేపు 17న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో మహాత్మా గాంధీ చిత్ర పటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిచారు.

ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుందని అన్నారు. పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఈ పథకం ఉపయోగ పడుతోందని అన్నారు. అందుకు నిరసనగా 17న రేపు జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలియజేయాలని సూచించారు. అలాగే జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28న గ్రామాలలో, మండలాల్లో గాంధీ చిత్రపటాలతో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 17న, 28న ఈ నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త, నాయకులు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read More... VB-G Ram G Bill: లోక్ సభలో వీబీ-జీ రామ్‌ జీ బిల్లు.. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు

గాంధీ అంటే మోడీకి నచ్చదు.. అందుకే పేరు మార్పు : రాహుల్ గాంధీ

Next Story