- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VB-G Ram G Bill: లోక్ సభలో వీబీ-జీ రామ్ జీ బిల్లు.. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు
హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై లోక్‍సభలో రభస జరిగింది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇవాళ ‘వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల్లు- 2025’ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మంత్రి సభలో బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన తెలిపారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
పేర్లు మార్చడం అంటే ఎందుకంత ఇష్టమో?:
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాకం గాంధీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులను తగ్గిస్తూ పెత్తనం పెంచుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథఖాల పేర్లను మార్చడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అయినా కేంద్రం మారుస్తూనే ఉందని విమర్శించారు. పథకాల పేర్లను మార్చడం అంటే మోడీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావడం లేదన్నారు. కొత్త బిల్లుతో ఉపాధిహామీ పథకం ప్రస్తుత చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పథకం కింద పని చేయించే హక్కును కొత్త బిల్లు గ్రామ పంచాయతీల నుంచి దూరం చేస్తోందన్నారు.
Read More... గాంధీ అంటే మోడీకి నచ్చదు.. అందుకే పేరు మార్పు : రాహుల్ గాంధీ






