గాంధీ అంటే మోడీకి నచ్చదు.. అందుకే పేరు మార్పు : రాహుల్ గాంధీ

by Muthe.Rajitha |   (  Updated:2025-12-16 11:07:36  IST  )

మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (MGNREGA) పేరు మార్చే బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ అంటే మోడీకి నచ్చదు.. అందుకే పేరు మార్పు : రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (MGNREGA) పేరు మార్చే బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండూ నచ్చవని, అందుకే ఈ పేరు మార్పు కార్యక్రమం అని విమర్శించారు. MGNREGA గాంధీజీ గ్రామ స్వరాజ్యం భావనల ప్రతిరూపమని, గ్రామీణ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఈ పథకాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిందని, ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.

MGNREGAను ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన’గా మార్చే బిల్లుతో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం, కేంద్రం ఆధిపత్యం పెంచడం జరుగుతోందని కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గాంధీ పేరు తొలగించడం ఆయన ఆదర్శాలకు అవమానమని రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా కేంద్రాన్ని విమర్శించారు.

Read More... VB-G Ram G Bill: లోక్ సభలో వీబీ-జీ రామ్‌ జీ బిల్లు.. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు

Next Story