TPCC: కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయం(Telangana Secretariat)లో సోమవారం తెలంగాణ తల్లి(Telangana Talli) విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

TPCC: కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయం(Telangana Secretariat)లో సోమవారం తెలంగాణ తల్లి(Telangana Talli) విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ నాయకులతో మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో జూమ్ సమావేశంలో మాట్లాడారు. ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏడాది పాలనపై ప్రభుత్వం చేసిన సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని అన్నారు. రేపు ముగింపు ఉత్సవాలలో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని.. ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story