- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 నుండి 50 సీట్లు: మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన
రాష్ట్రంలోని నియోజకవర్గాల అసెంబ్లీ డీలిమిటేషన్ జరిగితే 40 నుండి 50 సీట్లు మహిళలవేనని, జిల్లా నుండి నలుగురు లేదా ఐదుగురిని నామినేటడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నియోజకవర్గాల అసెంబ్లీ డీలిమిటేషన్ జరిగితే 40 నుండి 50 సీట్లు మహిళలవేనని, జిల్లా నుండి నలుగురు లేదా ఐదుగురిని నామినేటడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన సనావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మహిళలకు చట్ట సభలలో అధిక సీట్లు రానున్నాయని, రిజర్వేషన్లు ప్రకారమే కాకుండా బలమైన నాయకులుంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. పార్టీలో అన్ని విభాగాలను బలోపేతం చేస్తున్నామని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలనీ, యువతను ప్రోత్సాహించాలని ఆయన సూచించారు.
మహిళలది కీలకపాత్ర..
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇచ్చిన పదవులను అలంకార ప్రాయంగా కాకుండా బాధ్యతగా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని ఆయన సూచించారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి పెడుతోందని, మహిళా సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. పార్టీ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర అని, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఏ కష్టం వచ్చిన తనతో చెప్పాలని, పార్టీ క్రమశిక్షణను ఉల్లాంఘిస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ఎర్రబెల్లి స్వర్ణ స్పష్టం చేశారు. త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆఫీస్ ఇంచార్జీ మరియు అధికార ప్రతినిధులను నియమిస్తామన్నారు. త్వరలో జిల్లా పర్యటన వివరాలు తెలియజేస్తానని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






