Jubilee Hills: ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు మహేశ్ గౌడ్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)లపై గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Jubilee Hills: ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు మహేశ్ గౌడ్ దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)లపై గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జులు, బూత్ పరిశీలకులతో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సంపత్ కుమార్ ఎంపీలు ఎమ్మెల్యేలు, చైర్మన్‌లు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్(Telangana Congress) విజయం ఖాయమైందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు మంచి అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ చిన్న తప్పిదం కూడా చేయొద్దని సూచించారు. ఎన్నికల వ్యూహాలు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.

రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించామని అన్నారు. మనం చేసిన అభివృద్ధి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. ఎన్నికల బాధ్యతలు తీసుకున్న నాయకులు వారి బాధ్యతలు ఎక్కడా చిన్న నిర్లక్ష్యం చేయకుండా పని చేయాలని సూచించారు. ఈ వారం రోజులు చాలా కీలకమని అన్నారు. ఇంటింటి ప్రచారం చేయాలి.. మీరంతా చాలా అనుభవజ్ఞులైన నాయకులు మీరు ఓటర్లను ఎలా కాంగ్రెస్ వైపు నడపాలో మీకు బాగా తెలుసు.. గెలుపే లక్ష్యంగా, ప్రతీ నాయకుడు తానే అభ్యర్థిని అన్నట్టుగా పని చేయాలి. ఫలితం మనకు అనుకూలంగా రావడం ఖాయం. మంచి మెజారిటీ కూడా రావాలని దిశానిర్దేశం చేశారు.

Next Story