Congress: ఫ్యామిలీ తగాదా పరిష్కరించుకోలేని కేటీఆర్ మాపై విమర్శలా? మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-10-23 12:27:04  IST  )

కవిత పాదయాత్ర స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Congress: ఫ్యామిలీ తగాదా పరిష్కరించుకోలేని కేటీఆర్ మాపై విమర్శలా? మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం, సీఎంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు (KTR) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదని, బీఆర్ఎస్‍ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కుటుంబ తగాదాలు పరిష్కరించుకోలేని కేటీఆర్.. కాంగ్రెస్‍పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, ముందు కవిత మాటలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఆరాచక పాలన చేసింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారని రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) కూడా సున్నా రాబోతోందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలను ఈ ప్రభుత్వం సమానంగా చూస్తోందని, పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదైనా చేసిందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్రం నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

కవిత (Kavtha) పాదయాత్రను స్వాగతిస్తున్నాం: ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈనెల 25 నుంచి జాగృతి జనం బాట పేరుతో కవిత రాష్ట్రవ్యాప్త పర్యటన చేయబోతున్న నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాసమస్యలపై కవిత పాదయాత్ర చేయడం సంతోషం అన్నారు. అయితే పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న ముఠాైలో కవిత లేరా అని ప్రశ్నించారు. కేబినెట్ లో మైనారిటీకి అవకాశం ఉంటుందని చెప్పారు.

Next Story