‘నేను స్పదించేంత స్థాయి కేటీఆర్‌ది కాదు’.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నేను స్పదించే అంతా స్థాయి కేటీఆర్‌ది కాదని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు.

‘నేను స్పదించేంత స్థాయి కేటీఆర్‌ది కాదు’.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేను స్పదించే అంతా స్థాయి కేటీఆర్‌ది కాదని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ కేటీఆర్​వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది కదా.. అసెంబ్లీలో ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. కేసీఆర్​ఈ రాష్ట్రాన్ని నిర్బంధంగా పాలించరని విమర్శించారు. ఆనాడు నెలలో 15 హౌజ్ అరెస్టులు జరిగేవని పేర్కొన్నారు. కాంగ్రెస్​హయంలో నిర్భందాలు లేవు.. అందుకే కవిత ధర్నాలు చేస్తోందన్ననారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అవినీతి పై మాట్లాడితే అరెస్ట్ లు చేశారని, కాళేశ్వరం వద్దకు వెళదాం అనుకుంటే నిర్బంధించారని గుర్తుచేశారు. తనను బొల్లారం పోలీస్ స్టేషన్‌లో సాయంత్రం వరకు ఉంచారని, ఎక్కడబడితే అక్కడ అరెస్టులు ఉండేవని పీసీసీ చీఫ్​తెలిపారు. యూరియా సప్లయ్​ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

15 తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు..

ఈనెల 15 తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు వస్తాయని చెప్పారు. డీసీసీల కమిటీ కోసమే సీనియర్ ఇంచార్జి లను ఏర్పాటు చేశామని తెలిపారు. డీసీసీ ల కమిటీ ప్రక్రియ పూర్తి అయ్యాక త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందన్నారు. త్వరలో రాష్ట్రానికి ఏఐసీసీ అబ్జర్వర్లు వస్తారని పేర్కొన్నారు. ఈ నెల చివరి వరకు అన్ని కమిటీలు పూర్తి అవుతాయన్నారు.

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు..

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే లోకల్​బాడీ ఎన్నికలకు వెళ్ళాలని తాము ఆలోచన చేస్తున్నామని పీసీసీ చీఫ్​తెలిపారు. ఈవిషయంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపోతే అనిరుద్ రెడ్డి అంశంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్​మల్లు రవి విచారణ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుల గణన పత్రాలు తగులబెట్టారని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ వేరు.. అనిరుద్ అంశం వేరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అందుకే నిరసనలు చేస్తున్నారని, ఆపరేషన్ ఆకర్ష్ లైవ్ లొనే ఉందని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో పోటీకీ 10 మంది..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎక్కడ భై ఎలెక్షన్లు వచ్చిన తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎన్నికలో కాంగ్రెస్​పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని, జూబ్లీహిల్స్ సీట్ గెలుస్తున్నామని స్పష్టం చేశారు. మహిళ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నారు. మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదన్నారు. రాజకీయాల్లో ఒక్కో సారి జూనియర్ లకు ముందు అవకాశాలు వస్తాయన్నారు. సీనియర్లను సైతం పార్టీలు గుర్తిస్తుందన్నారు.

Next Story