అల్లు అర్జున్ ఇంటికి మహేశ్ కుమార్ గౌడ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-08 14:48:40  IST  )

ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్(Allu Aravind) కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పరామర్శించారు.

అల్లు అర్జున్ ఇంటికి మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్(Allu Aravind) కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి కలిశారు. అల్లు అర్జున్‌(Allu Arjun)తో మాట్లాడారు. ఇటీవలే ప్రఖ్యాత హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) సతీమణి అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఇప్పటికే వారి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతిని తెలియజేశారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారికి తోడుగా నిలవాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

Read Also..

దు:ఖంలో నిర్మాత అల్లు అరవింద్

Next Story