దు:ఖంలో నిర్మాత అల్లు అరవింద్

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-07 19:09:21  IST  )

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్నేహితుడు సి. నాగరాజు మరణించారు. చిన్ననాటి స్నేహితుడైన నాగరాజు.. అరవింద్‌తో కలిసి ఉండాలనే హైదరాబాద్‌కు రాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

దు:ఖంలో నిర్మాత అల్లు అరవింద్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్నేహితుడు సి. నాగరాజు మరణించారు. చిన్ననాటి స్నేహితుడైన నాగరాజు.. అరవింద్‌తో కలిసి ఉండాలనే హైదరాబాద్‌కు రాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మాస్టర్ సినిమా నుంచి ఈ సినీ ప్రయాణం కొనసాగుతోంది. అయితే 76ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో.. కుటుంబంతోపాటు అల్లు అరవింద్ దగ్గరుండి అంత్యక్రియల కార్యక్రమాన్ని చూసుకున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా సి.నాగరాజుకు మంచి స్నేహితుడు కాగా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అలాగే బండ్ల గణేష్, సురేష్ కొండేటి, బన్నీ వాసు, వంశీ నందిపాటి అంత్యక్రియలకు హాజరై సంతాపం వ్యక్తం చేశారు.





Next Story