- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కంటే రిజర్వేషన్లు ముఖ్యం.. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహాధర్నాలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే రిజర్వేషన్లు ముఖ్యం అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహాధర్నాలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే రిజర్వేషన్లు ముఖ్యం అని అన్నారు. తమిళనాడులో 8 సార్లు స్థానిక ఎన్నికలు జరగలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి మొనగాడని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారని, రాహుల్ గాంధీ ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన చేసి చూపించారని చెబుతున్నారన్నారు.
మోడీకి బీసీల బాధ తెలియాలని, 50 శాతం సీలింగ్ తీసివేయాలని అన్నారు. కిషన్ రెడ్డి చోటా మోటా లీడర్ అంటూ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి జీవితంలో పనిచేసి గెలవలేదని విమర్శించారు. ఎప్పుడూ దేవుళ్లు అని అంటారు, చేతకాని దద్దమ్మలు దేవుడి పేరిట రాజకీయం చేస్తున్నారని అన్నారు. ముస్లీంలను పక్కన పెడితేనే మద్దతు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. బీసీ పేరుతో బండి సంజయ్ ఓట్లు దన్నుకున్నారని విమర్శించారు. బీసీలకు మద్దతుగా అన్ని కులాల నేతలు వచ్చారని, రాహుల్ గాంధీలా రేవంత్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది.. రిజర్వేషన్లకు ఆమెదం తెలుపుతుందని చెప్పారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మహాధర్నాకు వచ్చాయని చెప్పారు.






