ఆశావాహులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకాలు.. ఖర్గేతో టీపీసీసీ చీఫ్ భేటీ

by Ramesh Naini |   (  Updated:2025-09-26 10:40:19  IST  )

రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులు నియామకం విషయంలో కాంగ్రెస్‌లోని ఆశావాహులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుడ్‌న్యూస్ చెప్పారు.

ఆశావాహులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకాలు.. ఖర్గేతో టీపీసీసీ చీఫ్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులు నియామకం విషయంలో (Congress) కాంగ్రెస్‌లోని ఆశావాహులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గుడ్‌న్యూస్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)తో మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాకు వివరాలు తెలుపుతూ.. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గే కు వివరించినట్లు తెలిపారు. అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో కొత్త డీసీసీ అధ్యక్షులు నియామకం పూర్తవుతుందని ప్రకటించారు. జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారని వెల్లడించారు.

క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్దేశించారని చెప్పుకొచ్చారు. సంస్థాగత పునర్నిర్మాణం పగడ్బందీగా, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పని చేయాలన్నారని తెలిపారు. అక్టోబర్ 4 వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. అక్టోబర్ 15 వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు సమర్పిస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని మరోసారి నొక్కి చెప్పారు.

Next Story