- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ విషపూరిత కుట్రలను తిప్పికొట్టాలి
ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉంటూ బీజేపీ విషపూరిత కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

బీజేపీ విషపూరిత కుట్రలను తిప్పికొట్టాలి..
-టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు
గాంధీభవన్‌లో 'సంఘటన్ సృజన్ అభియాన్' శిక్షణ
దిశ, తెలంగాణ బ్యూరో : ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉంటూ బీజేపీ విషపూరిత కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఎస్ఐఆర్, బీఎల్ఏ-2లపై శిక్షణా కార్యక్రమం జరిగింది. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిష్ణాతులతో ట్రైనింగ్ ఇచ్చారు. ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరబ్, నిశాంత్, అనూష ఇక్కడి మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గాల్లోని బీఎల్ఏలకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరయ్యారు.
ప్రతి ఓటును చూసుకోవాలి..
'సంస్థాగత నిర్మాణ ప్రక్రియను దేశంలోనే తెలంగాణలో పకడ్బందీగా చేశాం. ఇక్కడ సంఘటన్ సృజన్ అభియాన్ పక్రియ పూర్తి చేశాం. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్ఏలను నియమించాం. జిల్లా, మండల కమిటీలను దాదాపు పూర్తి చేశాం. పశ్చిమ బెంగాల్‌లో 60 లక్షల ఓట్లను తొలగించారు. అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయింది. ఇక్కడ అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాలి. ఇది చాలా కీలకమైన శిక్షణ. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. దేశంలో బీజేపీ విషపూరిత కుట్రలు చేస్తోంది' అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.






