- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధానాల్లో మార్పు రావాలి: రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ యువతకు ఉపాధి, అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు శుభాభినందనలు తెలియజేస్తూ, యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని ఆయన అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షలలో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. "ఉద్యోగాలు రావాలంటే విధానాల్లో మార్పు రావాలి" అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చే భారతదేశ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ మరింత ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది పెత్తందారులను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించిన మహేష్ కుమార్ గౌడ్, సాధారణ ప్రజలు, రైతులు, యువత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






