క్లాస్ లుక్‌లో హీట్ పుట్టిస్తున్న ఈషా రెబ్బా

by Pulgam srinivas |   (  Updated:2026-06-19 11:02:38  IST  )

వైట్ సారీలో వావ్ అనిపిస్తున్న ఈషా రెబ్బా

క్లాస్ లుక్‌లో హీట్ పుట్టిస్తున్న ఈషా రెబ్బా
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ ఈషా రెబ్బా ప్రస్తుతం కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ మెరిసిన ఈ భామ, తన అందం మాత్రమే కాకుండా నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో అభిమానులను అలరిస్తూనే, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. వాటిలో పూల డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో అలంకరించిన పలుచటి తెలుపు రంగు చీరలో ఆమె ఎంతో అందంగా కనిపించింది. దీనికి పింక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి క్లాసీ లుక్‌లో మెరిసింది.

అలాగే తన జుట్టును సహజంగా వదిలేసి, చిరునవ్వులతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్లాస్‌తో పాటు గ్లామర్‌ను కూడా జోడించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story