- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
28 నుంచి 3వ విడత జనహితయాత్ర
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపడుతున్న జనహిత పాదయాత్ర కొనసాగుతున్నది. ఈనెల 28 నుంచి ఆయన 3వ విడత పాదయాత్ర చేపట్టనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపడుతున్న జనహిత పాదయాత్ర కొనసాగుతున్నది. ఈనెల 28 నుంచి ఆయన 3వ విడత పాదయాత్ర చేపట్టనున్నారు. 28న నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో, 29న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం ఆయన ఈనెల 30న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ ఉద్యమంలో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఓట్ చోర్ గద్దె చోఢ్’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈనెల 26న కాంగ్రెస్ నాయకులు బిహార్‌లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం రెండో విడత జనహిత పాదయాత్ర ఈనెల 24న కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. చొప్పదండి, వరంగల్జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. మొదటి విడత పాదయాత్రను గతనెల 31 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించారు. వికారాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనసాగింది. పరిగి సమీపంలోని రంగాపూర్ నుంచి ఈ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ ఇన్ చార్జిమీనాక్షి నటరాజన్ తో పాటు ఆయా జిల్లాల మంత్రులు, జిల్లా ముఖ్యనేతలు, స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు.






