- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచానికి తెలంగాణ గొప్పతనాన్ని చెబుతాం: టీ.కాంగ్రెస్
భారత్ సమ్మిట్(Bharat Summit 2025) ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులతో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పర్యవేక్షించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ సమ్మిట్(Bharat Summit 2025) ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులతో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పర్యవేక్షించారు. భారత్ సమ్మిట్‌కు 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిపి మొత్తంగా 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్(Congress) మూల సిద్ధాంతాలు అయినా అహింసా, సత్యం, న్యాయం ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చ జరుగనుంది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండు రోజులపాటు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణను ప్రపంచానికి రోల్ మోడల్‌గా చూపడానికి భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.






