- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: కాంగ్రెస్ నాయకులకు తీపి కబురు.. జనవరి 15 లోపు అధ్యక్షుల నియామకం
ఈనెల 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉండబోతోందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‍లో పార్టీ పదవుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీపి కబురు చెప్పారు. 4 రోజుల్లో డీసీసీ (DCC) కార్యవర్గ కూర్పుపై నివేదిక ఇవ్వాలని టీపీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈనెల 15వ తేదీలోపు మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు అవ్వాలన్నారు. ఇవాళ డీసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గం కూర్పువిషయంలో మహేశ్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
పదవులు ఎవరికి దక్కేనో?:
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గం కోసం అధికార పార్టీలో కసరత్తు మొదలైంది. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షులను అధిష్టానం ప్రకటించినా కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో డీసీసీ కార్యవర్గం కూర్పులో తమకు అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్న వారు పార్టీ నిర్ణయంపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు విషయంలో గతంలోనే టీపీసీసీ మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. వీటికి అనుగుణంగా మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. దీంతో జనవరి 1 తర్వాత ఎప్పుడైనా జాబితా వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో డీసీసీ కార్యవర్గం కూర్పుపై నివేదిక ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించడంతో పార్టీ పదవులు ఎవరికి దక్కబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.






