- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ తక్షణమే పబ్లిక్‌గా సారీ చెప్పాలి.. మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు. శనివారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజానికి బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi)పై బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు.
పదేళ్లలో కేసీఆర్(KCR) ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పదేళ్ల నిరీక్షణ ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu)తో తీరబోతోందని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పేదల పక్షపాతి అని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్(CM Revanth Reddy), మంత్రుల హయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పాలన సాగుతోందని తెలిపారు.
రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్(BRS) నేతలకు కనువిప్పు కలిగిలా కాంగ్రెస్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నాలుగు ముక్కలు కావడం ఖాయమని.. బీఆర్ఎస్‌లో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ మిగలరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.






