- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలు ‘ఛీ’ కొట్టినా మార్పు రాకపోతే ఎలా?.. కేసీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఫామ్‌హౌస్ పాలన(Farmhouse Rule).. గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్(KCR) వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scan)లో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పగటి కలలు కంటున్నారని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్, కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదంంగా ఉందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా.. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది అని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో రేషన్ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తే పట్టించుకోని కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల వరకు రేషన్ కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధితో బీఆర్‌ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారని అన్నారు.
ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి, మాటతీరులో మార్పు రాకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు ఎన్ని సార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్ పామ్‌హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని సెటైర్ వేశారు.






