- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meenakshi Natarajan : నాడు NSUI లో.. నేడు పార్టీలో.. మీనాక్షీ నటరాజన్ నియామకంపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం
తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమించబడిన మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్(TPCC Cheif Mahesh kumar Goud) శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమించబడిన మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్(TPCC Cheif Mahesh kumar Goud) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ నియామకం మంచి పరిణామమని అన్నారు. ఆమె అత్యంత నిజాయితీ గల నేత అని, అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికి ఆదర్శంగా ఉండే నాయకురాలు ఆయన ఒక పేర్కొన్నారు. ఆమె రాజకీయ జీవితం కాంగ్రెస్ లో ఎన్ఎస్యూఐ(NSUI) నుంచి పార్టీలో పనిచేస్తున్నారని, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పని చేసారన్నారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలుగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆమె పనితీరు అందరికి ఆదర్శమని, 1999 -2000 సంవత్సరంలో మీనాక్షి నటరాజన్ జాతీయ ఎన్ఎస్యూఐ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో తనకు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న ఆయన పేర్కొన్నారు. తెలంగాణ లో భూదాన్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఎంతో ఉత్తేజ పరిచారని, మీనాక్షి నటరాజన్ ఇంచార్జ్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఇంచార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షి(Deepadas Munshi) కు ధన్యవాదాలని, దీపాదాస్ మున్షి పార్టీని పటిష్టం చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు.






