రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి.. మహేష్ కుమార్ గౌడ్ సంతాపం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి(Congress Leader Srinu) పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సంతాపం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి.. మహేష్ కుమార్ గౌడ్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి(Congress Leader Srinu) పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం చెన్నైపాలెం గ్రామానికి చెందిన శ్రీను మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో విశేషంగా కృషి చేసిన నేతగా ఆయన పాత్రను పీసీసీ చీఫ్ కొనియాడారు. శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుంటుబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద విషయంపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Next Story