- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రచారానికి వచ్చేముందు పవన్ వివరణ ఇవ్వాలి: మహేశ్ కుమార్ గౌడ్
పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేసే ముందు వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోయారని తాను అనుకోవట్లేదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేసే ముందు వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోయారని తాను అనుకోవట్లేదన్నారు. ఒక సినిమా నటుడుగా మాత్రమే పవన్ కళ్యాణ్ ను ఆరిస్తామని చెప్పారు. తాను చిరంజీవి అభిమానిని అని అన్నారు. కానీ అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరవాతనే పవన్ ప్రచారం చేయాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర మోకరిల్లాల్సిన పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీకి దిక్కులేదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అయినా నాయకులు అయినా కాళ్లకు బలుపు కట్టుకుని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదన్నారు. అందుకే పవన్ వద్దకు వెళ్లి మోకరిల్లారని అన్నారు. ఇదిలా ఉంటే పవన్ కొన్ని నెలల క్రితం కోనసీమలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని అన్నారు. నరదిష్టి ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. తెలంగాణ ప్రజలు, నాయకులు పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. కానీ ఇప్పటి వరకు పవన్ వివరణ ఇవ్వలేదు.






