కేసీఆర్ కంటే కోదండరాం ఎక్కువ ఉద్యమం చేశారు.. మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-08-14 13:11:20  IST  )

అదృష్టం ఉండి కేసీఆర్ సీఎం అయ్యారని, కోదండరాం వెనుక పడ్డారని మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ కంటే కోదండరాం ఎక్కువ ఉద్యమం చేశారు.. మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), అమెర్‌అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నియామకాల్లో ఇది వరకు జరిగిన తీరులోనే జరిగాయని తెలిపారు. దాంట్లో లొసుగులు ఉన్నాయని సుప్రీంకోర్టు భావించిన తర్వాత.. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు. (Congress) కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని, పొత్తులో భాగంగా కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు. ఆయన శాసనమండలిలో ఉండటం అవసరమని చెప్పారు. (KCR) కేసీఆర్ కంటే ప్రొఫెసర్ కోదండరాం ఎక్కువ ఉద్యమం చేశారని హాట్ కామెంట్స్ చేశారు.

అదృష్టం ఉండి కేసీఆర్ సీఎం అయ్యారని, కోదండరాం వెనుక పడ్డారని అన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం చట్టసభల్లో ఉండాలనే ఎమ్మెల్సీ ఇచ్చామని వివరించారు. అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తది అంటే చిన్న పిల్లోడు కూడా నవ్వుతాడని విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని కూడా అయిపోయిందని అన్నారు. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Next Story