- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రాకుండా ఉండాలనే హిల్ట్ పాలసీ: మహేష్ కుమార్ గౌడ్
హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోయందని హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకూడదు అనే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకువచ్చారని అన్నారు. ఇది ఒక గొప్ప పాలసీ అని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధరలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు హైదరాబాద్ నడిఒడ్డున ఉండటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని అన్నారు.
అందుకే ఓఆర్ఆర్ బయటకు తరలించి వాటి స్థానంలో రెసిడెన్షియల్ ఏరియా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది పూర్తిగా నిశ్పక్షపాతంగా చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు గత పదేళ్లలో హైదరాబాద్ ని దోచుకుంటుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. సీఎం ఒక సామెత లాగా మాట్లాడిన వ్యాఖ్యల్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా బీజేపీ వాళ్లకు పూట కూడా గడవదని విమర్శించారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.






