- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీని హత్య చేసిన గాడ్సేనే వాళ్లకు దేవుడు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర విలీనానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలను సెప్టెంబర్17న స్మరించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన రామనంద తీర్థ, జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహరావు వంటి మహనీయులను,

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర విలీనానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలను సెప్టెంబర్17న స్మరించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన రామనంద తీర్థ, జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహరావు వంటి మహనీయులను, నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, కమ్యూనిస్టు యోధులను స్మరించడం ప్రతి తెలంగాణ వాసి బాధ్యత అన్నారు. గాంధీ భవన్లో బుధవారం కాంగ్రెస్శ్రేణులు సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకున్నారు. తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ 1980లో పుట్టిందని, స్వాతంత్ర్యం, తెలంగాణ విలీన పోరాటాలకు ఆ పార్టీకి సంబంధం లేదని ఎద్దేవా చేశారు. ఇది పాత బీజేపీ కూడా కాదు.. 2014లో పుట్టిన మోడీ-షా బీజేపీ.. వీరికి చరిత్ర తెలియదు, చరిత్రను వక్రీకరించడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. గాంధీని గౌరవించని, గాడ్సేను దేవుడిగా చూసే వారి నుండి దేశభక్తి ఆశించడం వృథా ప్రయాసగా ఆయన అభివర్ణించారు. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా నాలుగు రోజుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిందని గుర్తుచేశారు. కానీ, నేడు అదే పటేల్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఆయన చేసిన విలీనాన్ని విమోచనగా పిలవడం పటేల్ ను అవమానించడం కాదా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని లొంగదీసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. బీహార్‌లో ఓటు దోపిడీ ప్రయత్నాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నడిపిస్తున్న ఓటు చోరీ ఉద్యమం బీజేపీ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగస్వరూపమని, స్వాతంత్య్రం కోసం అనేక మంది నాయకులు జైలు పాలయ్యారని... సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాని అయ్యే అవకాశమున్నా ఆర్థిక నిపుణుడు డా. మన్మోహన్ సింగ్‌ను రెండుసార్లు ప్రధాని చేశారు అనేది కాంగ్రెస్ త్యాగానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజా పాలన కొనసాగుతోందని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుంచి సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోంది : మహేష్ కుమార్ గౌడ్
మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని, కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గాంధీ భవన్ ప్రకాశం హల్ లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వెనకబడిన తరగతుల మహిళ సదస్సు మరియు ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి కుట్టు మిషన్ల కోసం, బడ్జెట్ మంజూరు కోసం డిప్యూటి సీఎంతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యా రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగెం జగదీష్ తదితరులు హాజరయ్యారు.






