- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు: టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ బిఆర్ఎస్ వేరు కాదని, కవిత వ్యాఖ్యలతో బీజేపీలో బిఆర్ఎస్ మానసికంగా విలీనం అయ్యిందని స్పష్టమైందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మోడీ మెప్పుకోసం ఉప రాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపకపోవడంతో మీ వైఖరి బట్టబయలు అయ్యిందని, మీరు పరోక్షంగా ఎన్డీయే మద్దతు తెలిపారని ఆయన విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ బిఆర్ఎస్ వేరు కాదని, కవిత వ్యాఖ్యలతో బీజేపీలో బిఆర్ఎస్ మానసికంగా విలీనం అయ్యిందని స్పష్టమైందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మోడీ మెప్పుకోసం ఉప రాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపకపోవడంతో మీ వైఖరి బట్టబయలు అయ్యిందని, మీరు పరోక్షంగా ఎన్డీయే మద్దతు తెలిపారని ఆయన విమర్శించారు. శనివారం మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం కేసు విచారణ సీబీఐకి ఇవ్వమని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని, 48 గంటల్లో అవినీతిని తేలుస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యరని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
బీజేపీలో బిఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరం పై విచారణ ఆగిందని భావిస్తున్నామని, కాళేశ్వరం సీబీఐ విచారణ తప్పించుకునేందుకు బిఆర్ఎస్ నేతల అగచాట్లు అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ మీ స్థాయి ఏంటి? దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి మీకుందా కేటీఆర్? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకు మెప్పు కోసం బీజేపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, కేటీఆర్ వ్యాఖ్యల వెనక బీజేపీ నేతలున్నారని అందుకే రాహుల్ పై కేటీఆర్ విమర్శలని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తారని, ఎమ్మెల్యేల ఫిరాయింపు స్పీకర్ పరిధిలోని అంశమన్నారు. వోట్ చోరీ ప్రపంచవ్యాప్తంగా ఆరా తీస్తున్నారని, వోట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ బట్ట బయలు చేశారన్నారు. కోట నీలిమకు నోటీసులు రాజకీయ కక్ష్య సాధింపు చర్య అని, ఈ చర్యను ఖండిస్తున్నామన్నారు. 2017లో కోట నీటిమ కుటుంబం చిరునామా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫామ్-6 ఇచ్చినా ఈసి చర్యలు తీసుకోలేదని, ఫామ్ - 6 ప్రకారం తమ విధులు సక్రమంగా నిర్వహించని ఈసీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో కోట నీలిమకు నోటీసులిచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కోట నీలిమకు నోటీసులపై న్యాయ పరంగా ముందుకు వెళతామన్నారు.






