కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

ఎమ్మెల్సీ క‌విత‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌విత ఏ పార్టీలో ఉన్నారో ఆమెకే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు.

కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ క‌విత‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌విత ఏ పార్టీలో ఉన్నారో ఆమెకే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు క‌విత జైలులో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం తాను, పొన్నం ప్ర‌భాక‌ర్ ఇత‌ర కాంగ్రెస్ నాయ‌కులు క‌ష్ట‌ప‌డ్డార‌న్నారు. తాము క‌ష్ట‌ప‌డితే వాళ్లు వీళ్లూ రంగులు పూసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. అస‌లు బీసీల‌కు 42 రిజ‌ర్వేష‌న్ల‌తో క‌విత‌కు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. క‌విత జెండా రంగు మారింది, గులాబీ నుండి బ్లూ రంగుకు వ‌చ్చింద‌ని ఎద్దేవా చేశారు. రంగులు మార్చేవారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ద‌త ఉంద‌ని, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక న‌మ్మ‌కం ఉంద‌న్నారు. కేసీఆర్, హరీష్ రావుల చేతగానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్ట్ కట్టారని విమ‌ర్శించారు. హ‌రీష్, రావు కేసీఆర్ సంత‌కం పెడితేనే బ‌న‌క‌చ‌ర్ల నిర్మాణం జ‌రిగింద‌న్నారు.

Next Story