Mahesh Kumar Goud: డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్ని భర్తీ

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీకి వచ్చే అవకాశముదని, రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేసే అవకాశముందని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Mahesh Kumar Goud: డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్ని భర్తీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీకి వచ్చే అవకాశముదని, రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేసే అవకాశముందని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్‌తో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఏఐసీసీకి పంపిస్తామని, ఉప ఎన్నికలో ముగ్గురు ఇంచార్జి మంత్రులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అభ్యర్ధి ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికలో ఎంఐఎం మద్దతు గురించి చూడాల్సి ఉందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.

మంత్రి పొన్నం వ్యాఖ్యలను వక్రీకరించారని, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరుతామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా సుస్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు మూడు రోజుల్లో ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌లో బస్తీ బాట చేపడుతారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ముందే ఊహించామన్నారు. డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులు అన్ని భర్తీ చేస్తామని, బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ ఉంటుందని, స్థానిక పరిస్థితులను పరిశీలించి లోకల్​బాడీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి పార్టీలతో పొత్తులపై నిర్ణయం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Next Story