రేపు విచారణకు రావట్లేదు.. చివరి నిమిషంలో ఈడీకి ట్విస్ట్ ఇచ్చిన మహేశ్ బాబు

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-27 09:58:52  IST  )

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేశ్ బాబు(Mahesh Babu) లేఖ రాశారు.

రేపు విచారణకు రావట్లేదు.. చివరి నిమిషంలో ఈడీకి ట్విస్ట్ ఇచ్చిన మహేశ్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేశ్ బాబు(Mahesh Babu) లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరుకాలేకపోతున్నాని.. తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న #SSMB29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మ‌హేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ కంపెనీ ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని, ఆ ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల ప్రకారం ఈ సోమవారం ఉదయం 10:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి మహేశ్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. షూటింగ్ నేపథ్యంలో విదేశాల్లో ఉండటం మూలంగా హాజరుకాలేకపోతున్నానని అధికారులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. మ‌రోవైపు ఈడీ నోటీసులపై మహేశ్ బాబు తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతునట్లు తెలుస్తోంది.

Next Story