- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి
by Ramesh Naini |
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఇటీవల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కొత్త బోర్డును నియమించారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయిదా పడ్డ టీఎస్పీఎస్సీ పరీక్షలు.. ఇకపై పరీక్షల నిర్వహణ సక్రమంగా ఉంటుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తంచేశారు.
Next Story






