- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కట్టలు తెంచుకున్న రైతుల కోపం.. యూరియా కేంద్రం ఎదుట ఏం చేశారంటే?
యూరియా(Urea) కొరత అంశం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: యూరియా(Urea) కొరత అంశం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట యూరియా కోసం రైతులు(Telangana Farmers) ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లదాడి చేశారు. యూరియా దుకాణం బోర్డు చించేశారు. అంతేకాదు.. దుకాణం ఎదుట కర్రలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవటం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు. చైనా నుంచి ఎర్రసముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం వల్ల కొరత ఏర్పడిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్రం 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పిందని, ఇప్పటి వరకు 5.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతాంగం ఆందోళనలో ఉందని, ఈ నెలలో పంటలకు ఎరువులు చాలా అవసరమన్నారు.






