ఘనంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం : కేక్ కట్​చేసిన మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నివాసంలో కేక్ ​కట్​ చేశారు.

ఘనంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం : కేక్ కట్​చేసిన మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నివాసంలో కేక్​కట్​చేశారు. ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ సంఘం పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. ఉపాధి హామీ చట్టం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఆర్ డీఎస్​ బోర్డు లో జరిగిన అంశాలను, నాన్ ఫైనాన్షియల్ ఇష్యులను త్వరగా క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి రాష్ట్ర జేఏసీ సంఘం మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య, కో చైర్మన్లు అంజిరెడ్డి, మురహరి విజయ్ కుమార్, వెంకటరామిరెడ్డి, మోహన్ రావు, తంగెళ్ళ రఘు, రామక్రిష్ణ, గురు చరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story