- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandhi: బీర్ టిన్ లపై మహాత్మాగాంధీ ఫోటోలు.. ఆ దేశంపై ఇండియన్స్ ఆగ్రహం
మహాత్మగాంధీ విషయంలో ఓ బీర్ల కంపెనీ అపచారానికి ఒడిగట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని జీవితాంతం పోరాటం చేసిన మన జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘోర అవమానం జరిగింది. ఏ మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారో అదే మద్యాన్ని తన ఫోటోలతో విక్రయించడం కలకలం రేపుతున్నది. ఓ రష్యన్ బేవరేజ్ కంపెనీ బరితెగింపుపై తాజాగా సోషల్ మీడియాలో వివాదం రేగింది. రష్యన్ కు (Russian Beer) చెందిన రివోర్ట్స్ (Rewort) కంపెనీ హాజీ ఐపీఏ పేరుతో బీర్ టిన్లను విక్రయిస్తోంది. అయితే ఆ బీర్ టిన్ల (Beer Tin) పై తాజాగా మహాత్మాగాంధీ ఫోటోతో పాటు ఆయన పేరు చివరకు ఆయన సంతకాన్ని కూడా ముద్రించి అమ్ముతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదరు కంపెనీ తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రచారం చేసిన వ్యక్తి ఫోటోను బీర్ల విక్రయాల కోసం ఎలా ముద్రిస్తారంటూ మండిపడుతున్నారు.
ప్రధానికి సీఎం మనవడు ఫిర్యాదు:
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగడంతో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సువర్ణో సత్పతి ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ (Narendra Modi) దృష్టికి తీసుకువెళ్లారు. మోడీ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రష్యా అధ్యక్షుడితో చర్చించాలని కోరారు. కాగా రివోర్ట్స్ కేవలం గాంధీజీ ఫోటోలతో మాత్రమే కాకుండా మదర్ థెరిసా, నెల్సన్ మండెలా మార్టిన్ లూథర్ కింగ్ వంటి ప్రపంచ స్థాయి నేతల పేర్లతో బీర్లను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది.






